కర్ణాటక కాంగ్రెస్‌లో చీలికలు వచ్చేఅవకాశముందని ప్రతిపక్ష బీజేపీ నేత అశోక ఆరోపించారు. ఏక్‌నాథ్ శిందే తరహాలో ఆ పార్టీని ఉపముఖ్యమంత్రి డి.కే శివకుమార్ బీజేపీలో విలీనం చేసే అవకాశముందని తెలిపారు. నవంబర్16న కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు జరగనుందని జోస్యం చెప్పారు. అయితే శివరాత్రి వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు డి.కే శివకుమార్ పాల్గొనటంతో పుకార్లు రేగాయి. ఉప ముఖ్యమంత్రి దీన్ని ఖండించారు.
అయితే తాజాగా కర్ణాటక బీజేపీ.. డీకే శివకుమార్ మరో మహారాష్ట్ర ఏక్ నాథ్ షిండే కానున్నారంటూ వ్యాఖ్యానించడం కూడా కాంగ్రెస్ లో మరింత అలజడి రేపింది. మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్చి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏక్ నాథ్ షిండే సహకరించిన విషయాన్ని ఆర్ అశోక ప్రస్తావించారు. అదే బాటలో డీకే శివకుమార్ కూడా నడిచి కాంగ్రెస్ ను చీల్చుతారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బలమైన నేతగా ఉన్న డీకే.. ఆ పార్టీని కూల్చడం జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు.