డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి షాక్‌ల మీద షాక్‌లు
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. రియాను ఇప్పటికే ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసులో..;
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. రియాను ఇప్పటికే ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసులో బెయిల్ కోసం ముంబై ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది రియా. కానీ రియాతోపాటు మరో ఐదుగురి బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, అబ్దుల్ బాసిత్, జైద్ విలత్రా, సావంత్, శామ్యూల్ మిరండా బెయిల్ పిటిషన్లను ముంబై ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. డ్రగ్స్ కేసులో రియాకు సెప్టెంబర్ 22 వరకు కోర్టు ఇటీవలే జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇక బాలీవుడ్‌కు చెందిన 25 మంది సెలబ్రెటీల పేర్లను రియా చక్రవర్తి ఎన్‌సీబీ విచారణలో వెల్లడించినట్లు సమాచారం.