Deputy Speaker : డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిందేనా?

Update: 2024-06-26 05:42 GMT

డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిందేనా అంటే అలా అని ఎటువంటి నిబంధనా లేదు. 1956లో అప్పటి నెహ్రూ ఈ పదవిని ప్రతిపక్షాలకిచ్చే సంప్రదాయం ప్రారంభించారు. ఎమర్జెన్సీ కాలం, కొన్ని పర్యాయాలు మినహా ఆ పదవిని ప్రతిపక్షాలే పొందాయి. ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని ప్రస్తుతం INDIA కూటమి అడుగుతోంది. ఈసారి తమకు ప్రతిపక్ష హోదా(56 MPసీట్లు) ఉందంటోంది. గత 17వ లోక్‌సభలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ స్థానాన్ని కేంద్రం ఖాళీగా ఉంచేసింది.

లోక్‌సభ స్పీకర్‌గా ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా ఎన్నిక లాంఛన ప్రాయంగా మారింది. స్పీకర్‌గా ఎన్నికయ్యేందుకు కావాల్సిన సభ్యుల మద్దతు(293) ఆయనకు ఉంది. అటు స్పీకర్‌ అయ్యేందుకు ఇండియా కూటమి అభ్యర్థి సురేశ్‌కు ఉన్న మద్దతు చాలదు. ఇదిలా ఉంటే సభ్యులకు సభలో ఇంకా సీట్లు కేటాయించకపోవడంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ సాధ్యం కాదు. సో సభ్యులకు స్లిప్స్ ఇచ్చి, మాన్యువల్‌గా ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News