Sixth Phase Polling : ఆరో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Update: 2024-05-25 05:02 GMT

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5 దశల పోలింగ్ ముగియగా నేడు ఆరో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. బిహార్‌లో 8, హరియాణాలో 10, జమ్ముకశ్మీర్‌లో 1, ఝార్ఖండ్‌లో 4, ఢిల్లీలో 7, ఒడిశాలో 6, UP 14, బెంగాల్‌లో 8 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 1న జరిగే ఆఖరి దశ పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. 4న ఫలితాలు వెల్లడవుతాయి.

ప్రస్తుతం ఇవాళ పోలింగ్ జరుగుతున్న సీట్లలో చాలా మంది ప్రముకులు పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ కర్నాల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా, మరో మాజీ సీఎం మొహబూబా ముప్తీ అనంత్‌నాగ్‌ రాజౌరి నుంచి పీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, బీజేపీ సీనియర్ లీడర్‌ మాజీ మంత్రి మేనకా గాంధీ, బన్సూరి స్వరాజ్‌, సోమ్‌నాథ్‌ భారతీ, మనోజ్‌ తివారీ, కన్హయ్య కుమార్, దినేష్‌ లాల్ యాదవ్‌, ధర్మేంద్ర యాదవ్‌, అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌, అగ్నిమిత్ర పాల్‌, నవీన్‌ జిందాల్‌, రాజ్‌ బబ్బర్‌, దీపేందర్‌ సింగ్‌ హుడా, కుమారీ షెల్జా, అపరజిత్‌ సరాంగియా ఇవాళ పోలింగ్‌ జరిగే సీట్లలో పోటీ పడుతున్నారు.

ఈ దశలో అందరిచూపు దేశ రాజధాని ఢిల్లీ వైపు ఉంది. ఇక్కడ ఉన్న 7 పార్లమెంట్ స్థానాలకు ఇదే దశలో పోలింగ్ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ ఉన్న మొత్తం సీట్లలో బీజేపీ పాగా వేసింది. అయితే ఈసారి బీజేపీకి బ్రేకులు వేసే దిశగా ఆప్ తో పాటు కాంగ్రెస్ అడుగులు వేస్తున్నాయి. ఇండియా కూటమిలో భాగంగా…. దేశ రాజధానిలో కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఆప్ నాలుగు స్థానాల్లో అభ్యర్తులను నిలబెట్టింది.

Tags:    

Similar News