Union Minister Jitendra Singh : 2035 నాటికి స్పేస్ స్టేషన్.. 2040 నాటికి చంద్రుడిపైకి భారత ఆస్ట్రోనాట్..

Update: 2025-04-10 11:45 GMT

చంద్రయాన్ వరుస ప్రయోగాలు భారతదేశ భవిష్యత్ అంతరిక్ష లక్ష్యాలను సాకారం చేస్తాయని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్ చెప్పారు. చంద్రయాన్ తో ప్రపంచానికి తన రోదసి ప్రయోగాల సత్తాను భారత్ చాటిందన్నారు. ఇదే ఉత్సాహంతో జాబిల్లిపైకి వ్యోమగామిని పంపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. 2040 నాటికి ఇది కార్యరూపం దాల్చుతుందని చెప్పారు. రైజింగ్ భారత్ సమ్మిట్ లో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. అలాగే 2035 నాటికి సొంతంగా భారత్ స్పేస్ స్టేషన్ను నిర్మిస్తుందని తెలిపారు. భారత అంతరిక్ష సంస్థ చంద్రయాన్ 4 ప్రయోగాన్ని 2027లో చేపట్టనుంది. అందులో భాగంగా ఎల్పీఎం రాకెట్ను ఇప్పటికే రెండు సార్లు ప్రయోగించింది. చంద్రయాన్ తదుపరి ప్రయోగానికి సంబంధించిన ఐదు భిన్న పరికరాలను నింగిలోకి పంపి, వాటిని కక్ష్యలోనే నిలపనున్నారు.

Tags:    

Similar News