హోళీ (Holi) సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 23 నుంచి 27 వరకు ఈ రైళ్లు నడవనున్నట్లు పేర్కొంది. 23న హైదరాబాద్-ధనపూర్, 25న సంత్రాగచి-సికింద్రాబాద్, 26న ధనపూర్-హైదరాబాద్, 24న సంత్రాగచి-చెన్నై సెంట్రల్, 27న పట్నా-కోయంబత్తూర్ మధ్య రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది.
హోళీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో ఎల్లుండి వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. ఎవరైనా మద్యం సేవించి గొడవలు సృష్టించినా.. రహదారులపై గుంపులుగా తిరిగినా కేసులు నమోదు చేయనున్నారు. నగరంలో తిరిగే వాహనాలపై కానీ, జనాలపై కానీ రంగులు చల్లకూడదని పోలీసులు హెచ్చరించారు.