Private Rocket : విజయవంతంగా నింగిలోకి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్

Update: 2024-05-30 05:45 GMT

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. గురువారం ఉదయం 7.15 గంటలకు శ్రీహరికోటలో మొదటి ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి 4వ ప్రయత్నంలో నింగిలోకి దూసుకెళ్లిన అగ్నిబాణ్ చరిత్ర సృష్టించింది. చివరి నిముషంలో సాంకేతిక కారణాలతో మూడు సార్లు ప్రయోగం వాయిదా పడిన సంగతి తెలిసిందే.

నాలుగో ప్రయత్నంలో విజయవంతంగా ప్రయోగించింది చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ స్టార్టప్ సంస్థ. భూమికి 700 కిలోమీటర్లు ఎత్తు లోని లో ఎర్త్ ఆర్బిట్ లో 300 కిలోల లోపు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు చేపట్టింది ఈ ప్రయోగం. భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా సాగుతున్న ప్రయత్నాలలో కీలకంగా మారింది ప్రయోగం. ఈ ప్రయోగ ప్రక్రియను పర్యవేక్షించారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.

Tags:    

Similar News