Supreme Court : ట్రైనీ డాక్టర్ కేసులో సిట్ దర్యాప్తుకు సుప్రీం ఓకే

Update: 2024-11-26 08:45 GMT

కోల్కతాలోని ఆర్కర్ మెడికల్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై లైంగిక దాడి, హత్య కేసుకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు విచారించింది. ఈ ఘటనపై నిరసన సందర్భంగా అరెస్ట్ అయిన మహిళను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచే శారనే ఆరోపణలున్నాయి. దీంతో ఈ కేసులో సిట్ దర్యాప్తునకు న్యాయస్థానం ఆదేశించింది. అన్నింటినీ సీబీఐకి బదిలీ చేయడం సాధ్యం కాదని గమనించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం కలకత్తా హైకోర్టు ఆదేశాలను సైతం సవరించింది. విచారణను రాష్ట్రంలోని సీనియర్ ఐపీఎస్ అధికారులకు అప్పగించాలని తెలిపింది. ప్రభుత్వం పేర్కొన్న అధికారులను సిట్ లో చేర్చాలని, ఈ బృందం ప్రతి వారం తమ నివేదికను హైకోర్టుకు అందజేయాలని ఆదేశించింది. ఈ విషయంలో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించింది. ఈ ధర్మాసనం ఎదుట సిట్ నివేదిక అందజేసిన అనంతరం దర్యాప్తు చేపట్టనుంది.

Tags:    

Similar News