Supreme Court : శ్రీశైలంలో అన్యమతస్తులకు షాపులపై సుప్రీం స్టే కొనసాగింపు
శ్రీశైలంలో అన్యమతస్తులకు షాపులు కేటాయించవద్దన్న జీవో నెంబర్ 425పై స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రీశైలం దేవస్థానం ప్రాంతంలో అన్య మతస్తులకు దుకాణాలు కేటాయించవద్దని 2015లో జీవో 425ను అప్పటి ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఈ జీవో 425 ను సవాల్ చేస్తూ పలువురు దుకాణదారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2020లో సుప్రీం కోర్టు జీవోపై స్టే విధించింది. అయితే స్టే విధించినప్పటికీ మళ్లీ టెండర్లను ప్రభుత్వం పిలిచిందని ఫిర్యాదుదారులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దుకాణాల వేలం టెండర్లను పొరపాటున జారీ చేశామని, ప్రస్తుతం వాటిని ఉపసంహరించుకు న్నామని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ఈ అంశంపై స్థానిక అధికారులకు అయోమయం లేకుండా తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. జీవో 425 అమలు చేయొద్దని మరోసారి స్పష్టంగా ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ అభయ్ కా, జస్టిస్ ఉజ్జన్ భూయల్ తెలిపారు. జీవో 425ను అమలు చేయొద్దని మరోసారి ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది.