Supreme Court : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్టు షాక్

Update: 2024-03-11 07:45 GMT

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (SBI) సుప్రీం కోర్టు (Supreme Court) షాక్ ఇచ్చింది. ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలు రేపటిలోగా సమర్పించాలని ఆదేశించింది. జూన్ 30 వరకు గడువు కావాలని SBI దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. 26 రోజులుగా ఏం చేశారని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహించింది. మార్చి 15 సాయంత్రం 5గంటల్లో ఈసీ తన దగ్గరున్న వివరాలను అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.

ఏప్రిల్ 12, 2019 నుంచి అన్ని ఎలక్టోరల్ బాండ్ కొనుగోళ్ల వివరాలను ఈసీకి అందించడానికి గడువును పొడిగించాలని కోరుతూ ఎస్బీఐ చేసిన పిటిషన్‌ను విచారిస్తున్న క్రమంలో అత్యున్నత న్యాయస్థానం తీవ్రమైన పరిశీలనలు వచ్చాయి. ఐదుగురితో కూడిన న్యాయమూర్తుల ధర్మాసనం ఈ విషయంపై విచారణ చేపట్టింది

Tags:    

Similar News