Suresh Gopi : కేంద్రమంత్రిగా చార్జ్ తీసుకున్న సురేష్ గోపీ.. అనుమానాలు పటాపంచలు

Update: 2024-06-11 07:50 GMT

సార్వత్రిక ఎన్నికల్లో కేరళ నుంచి గెలిచిన ఒకే ఒక్కడైన బీజేపీ ఎంపీ, నటుడు సురేష్ గోపికి ( Suresh Gopi ) అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి దక్కింది. కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ సహాయమంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.

కేరళలో త్రిసూర్ పార్లమెంట్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు సురేష్ గోపీ. సీపీఐ అభ్యర్థి సునీల్ కుమార్ పై 74వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆదివారం కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కొన్ని గంటలైనా గడవక ముందే సురేష్ గోపి రాజీనామా చేస్తున్నారంటూ వార్తలు షికార్లు చేశాయి. వార్తలపై స్పందించిన సురేష్ గోపి తన రాజీనామా అంటూ తప్పుడు కథనాలు వ్యాప్తిచేస్తున్నారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మోడీ కేబినెట్ లో ఉండడం గర్వకారణంగా భావిస్తున్నట్లు చెప్పారు.

మంగళవారం బాధ్యతలు స్వీకరించిన సురేష్ గోపీ మోడీ నాయకత్వంలో దేశాభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు.

Tags:    

Similar News