Swati Maliwal : కోర్టులో ఏడ్చిన స్వాతి మాలివాల్.. తీర్పు రిజర్వ్

Update: 2024-05-28 07:18 GMT

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్ దాడి కేసు విచారణ సందర్భంగా హజారీ కోర్టులో కన్నీరు పెట్టుకున్నారు. బిభవ్ కుమార్ సామాన్య వ్యక్తికాదని ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ఆమె కోరారు. ఓ యూట్యూబర్ కారణంగా తనకు బెదిరింపులు వస్తున్నాయని న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సహాయకుడు విభవకుమార్ బెయిల్ పిటిషన్ పై సోమవారం నాడు హజారీ కోర్టులో విచారణ జరిగింది.

ముఖ్యమంత్రి నివాసంలో సీసీ కెమెరాలు లేని ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడే దాడి జరిగినట్లు మహిళా ఎంపీ చెబుతున్నారని ఆరోపించారు విభవ కుమార్ తరఫు లాయర్. అక్కడ రికార్డింగ్ సాధనాలు లేవన్న విషయం ఆమెకు తెలుసునని విభవ్ కుమార్ లాయర్ చెప్పారు. మే 13న ముఖ్యమంత్రి ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం అతిక్రమణే అని.. ఉద్దేశపూర్వకంగానే ఆమె సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను విన్న మాలీవాల్ కోర్టులోనే కన్నీటి పర్యంతమయ్యారు.

ఆమ్ ఆద్మీకి చెందిన ట్రోల్ ఆర్మీ తనను వేదిస్తోందని ఆమె ఆరోపించారు. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. గతంలో ఆప్ వాలంటీర్ గా పని చేసిన ఓ యూట్యూబర్ తనపై ఏకపక్షంగా ఒక వీడియో పోస్టు చేసిన తరువాత అత్యాచారం, హత్య చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. విభవ కుమార్ కు బెయిల్ ఇస్తే తనకు, తన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పారు. అటు ఢిల్లీ పోలీస్ లాయర్ కూడా మాలీవాల్ వాదనను బలిపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వు చేసింది.

Tags:    

Similar News