Jumili Bill : జమిలి బిల్లుకు టీడీపీ మద్దతు

Update: 2024-12-17 11:45 GMT

జమిలి బిల్లుకు టీడీపీ మద్దతు తెలిపింది. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టగా.. టీడీపీ బేషరతుగా మద్దతిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. అంతకముందు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ ఆవరణలో మాట్లాడుతూ.. జమిలీ ఎన్నికలకు టీడీపీ సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ బిల్లు ద్వారా దేశ‌వ్యాప్తంగా సుపరిపాలన అందుతుందన్నారు. జమిలి ఎన్నికలను టీఎంసీ, డీఎంకే వ్యతిరేకించాయి. ప్రస్తుతం కావాల్సింది జమిలి కాదని, ఎన్నికల సంస్కరణలని టీఎంసీ అభిప్రాయపడింది. జమిలి వల్ల రాష్ట్రాల హక్కులు హరించాలని కేంద్రం చూస్తోందని మండిపడింది. మరోవైపు 2/3 మెజార్టీ లేకుండా బిల్లును ఎలా ప్రవేశపెడతారని డీఎంకే ప్రశ్నించింది. బిల్లును జేపీసీకి పంపాలని డిమాండ్ చేసింది.

Tags:    

Similar News