Javelin Missiles: ట్యాంకుల పాలిట సింహస్వప్నం 'జావెలిన్'

భారత రక్షణ బలోపేతానికి అమెరికా అండ

Update: 2025-11-22 05:30 GMT

మారుతున్న భద్రతా దృష్ట్యా సైనిక బలగాల ఆధునికీకరణలో భాగంగా భారత్ మరిన్ని కీలక ఆయుధ వ్యవస్థలను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, ట్యాంకుల పాలిట సింహస్వప్నంగా పేరుగాంచిన అత్యాధునిక 'జావెలిన్' క్షిపణి వ్యవస్థను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా సుముఖత వ్యక్తం చేసింది. ఇది భారత సైనికుల పోరాట సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతోపాటు, యుద్ధరంగంలో వారిని మరింత సురక్షితంగా ఉంచడానికి దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న అధునాతన ట్యాంకు విధ్వంసక క్షిపణుల్లో జావెలిన్ ఒకటి. దీనిని అమెరికాకు చెందిన రేథియాన్, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఆయుధాన్ని భారీ లాంఛ్ వ్యవస్థలు లేకుండా, సైనికుడి భుజంపైనుంచి సులువుగా ప్రయోగించవచ్చు.

జావెలిన్ ఒక 'ఫైర్ అండ్ ఫర్గెట్' (Fire and Forget) ఆయుధం. అంటే, లక్ష్యాన్ని నిర్దేశించిన తర్వాత, క్షిపణిలోని పరారుణ సీకర్ (Infrared Seeker) సహాయంతో అది లక్ష్యాన్ని ఛేదించే పనిని సొంతంగా చూసుకుంటుంది. దీనివల్ల ప్రయోగించిన సైనికుడు వెంటనే వేరేచోటుకు వెళ్లిపోవచ్చు లేదా మరో లక్ష్యాన్ని గురిపెట్టవచ్చు.

టాప్ ఎటాక్ మోడ్: క్షిపణి సుమారు 500 అడుగుల ఎత్తుకు చేరి, ట్యాంకు కవచం అంతగా పటిష్టంగా లేని పైభాగాన్ని ఛేదిస్తుంది.

డైరెక్ట్ ఎటాక్ ఆప్షన్: ఇది నేరుగా వెళ్లి బంకర్లు, భవనాలు, వాహనాలను ధ్వంసం చేస్తుంది.

సాఫ్ట్‌లాంచ్ డిజైన్: ఈ డిజైన్ కారణంగా దీన్ని బంకర్లు, భవనాలు వంటి నిర్మాణాల లోపలి నుంచి కూడా సురక్షితంగా ప్రయోగించవచ్చు. ఇది ప్రయోగించిన సైనికుడికి వేడి వాయువుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

కవచ ఛేదన: ట్యాం­కు­ల­కు ఉండే సాం­ప్ర­దాయ కవ­చం­తో పాటు దు­ర్భే­ద్య­మైన ఎక్స్‌­ప్లో­జి­వ్ రి­యా­క్టి­వ్ ఆర్మ­ర్ (ERA)లనూ ఛే­దిం­చే సత్తా దీ­ని­కి ఉంది. ట్యాం­కు­ను ధ్వం­సం చే­య­డా­ని­కి ఇది రెం­డు దశల పే­లు­ళ్ల­ను సృ­ష్టి­స్తుం­ది. జా­వె­లి­న్‌­ను అఫ్గా­ని­స్థా­న్, ఇరా­క్‌­ల­లో వి­రి­వి­గా ఉప­యో­గిం­చా­రు. రష్యా­పై పో­రు­లో ఉక్రె­యి­న్ దీ­ని­ని భా­రీ­గా ప్ర­యో­గిం­చి రష్యా ట్యాం­కు­ల­ను సమ­ర్థ­వం­తం­గా వి­ధ్వం­సం చే­య­డం­తో, ఉక్రె­యి­న్‌­లో దీ­ని­ని 'సె­యిం­ట్'­గా అభి­వ­ర్ణిం­చా­రు. ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా 25కి పైగా దే­శా­లు ఈ వ్య­వ­స్థ­ను ఉప­యో­గి­స్తు­న్నా­యి. లక్ష్య ఛే­ద­న­లో దీని కచ్చి­త­త్వం 94 శా­తం­గా ఉంది.

Tags:    

Similar News