Uttar Pradesh : కాంగ్రెస్ లోకి వరుణ్ గాంధీ .. అధిర్ రంజన్ చౌదరి ఆహ్వానం

Update: 2024-03-27 06:11 GMT

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) అభ్యర్థుల ఎంపికలో భాగంగా బీజేపీ (BJP) కొందరు సిట్టింగ్ ఎంపీలకు షాకిచ్చింది. కొందరు కేబినెట్ మంత్రులను సైతం పక్కనబెట్టేందుకు బీజేపీ హైకమాండ్ ఏమాత్రం సంశయించ లేదు. అలాగే, టిక్కెట్లు ఇవ్వకుండా కొందరు ముఖ్యనేత లకు షాకిచ్చింది. ఈ జాబితాలో మేనకా గాంధీ తనయుడు, ఉత్తరప్రదేశ్లోని (UP) పిలిఖిత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీ ఒకరు. గత కొంతకాలంగా పార్టీ విధానాలను విమర్శిస్తున్నందునే ఆయన్ను పార్టీ పక్కనబెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కేంద్రంతోపాటు, యూపీలోని యోగి ప్రభుత్వంపైనా వరుణ్ అసమ్మతి గళం వినిపించారు. కొన్ని ముఖ్యమైన విషయాలలో పార్టీ నిర్ణయాలను బహిరంగంగానే విమర్శించారు. కొంతకాలంగా పిలిభిత్ క్రియాశీలకంగా ఉంటున్న ఆయన, బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ ఆఫర్ ఇచ్చింది. వరుణ్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి వరుణ్ గాంధీ వస్తే స్వాగతిస్తామని అన్నారు. 'వరుణ్ గాంధీ (Varun Gandhi) కాంగ్రెస్లోకి వస్తే మేం ఎంతో సంతోషిస్తాం. అతను విద్యావంతుడు. క్లీన్ ఇమేజ్ కలిగిన వ్యక్తి, కానీ గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో బీజేపీ టికెట్ నిరాకరించింది. అందుకే ఆయనను మేం సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వా నిస్తున్నాం' అని అధర్ రంజన్ అన్నారు. పిలిభిత్ నుంచి వరుణ్ గాంధీ 2009, 2019లో విజయం సాధించారు.

Tags:    

Similar News