దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.300 నుంచి రూ.307కి పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు రూ.7 పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన వేతనం అమల్లోకి రానుంది.మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పల్లె పండగలో భాగంగా ఉగాది రోజున రూ.557 కోట్లతో 1,202.66 కిలోమీటర్ల మేర 402 రహదారుల పనులు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. గ్రామాలు, మండలాలను కలిపే రోడ్లను నిర్మించనున్నారు. పనులను త్వరగా, నాణ్యతగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. నాబార్డు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో ఇప్పటికే 4 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోంది.