Rajnath Singh : 100 మందిని మట్టుబెట్టాం : రాజ్ నాథ్ సింగ్

Update: 2025-05-08 12:00 GMT

పహెల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకా రం తీర్చుకుందని, ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఇప్పటి వరకు కనీసం వంద మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరు గుతోంది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ.. ఈ సమయంలో పరిస్థితిని మరింత తీవ్రతరం చేయకూడదని భారతదే శం కోరుకుంటున్నప్పటికీ, పాకిస్తాన్ దాడి చేస్తే అది ప్రతీకారం తీర్చుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా మద్దతు ఇస్తామని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసు కునేందుకు ఆపరేషన్ కు ముందు, తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నప్ర భుత్వ నిర్ణయాన్ని రాహుల్ అభినందించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక సమావే శానికి ప్రధాని గైర్హాజరుపై ప్రశ్నించారు. కీలక సమావేశానికి రాలేదని అన్నారు. ఇది సంక్షోభ సమయమని, తాము విమర్శల జోలికి వెళ్లడం లేదని అన్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు సమావేశంలో పరిణతిని ప్రదర్శిం చారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. "దేశం ఇంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, రాజకీయాలకు చోటు లేదు. అందరు నాయకులు ఏకగ్రీవంగా సాయుధ దళాలను ప్రశంసించారు. ప్రభుత్వా నికి, సైన్యానికి మద్దతుగా నిలిచారు. ఎవరికీ వ్యతిరేకత లేదు" అని ఆయన అన్నారు.

Tags:    

Similar News