Election Deposit : ఎన్నికల డిపాజిట్ అంటే ఏమిటి?

Update: 2024-04-18 04:58 GMT

ఎన్నికల సమయంలో సరదాగా వేసే నామినేషన్లను నిలువరించేందుకు ఎన్నికల సంఘం ఎన్నికల డిపాజిట్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ప్రజాప్రతినిధుల చట్టం 1951 సెక్షన్ 34,1(ఎ) దీనికి సంబంధించిన నిబంధనలు తెలియజేస్తుంది. దీని ప్రకారం పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే వ్యక్తి రూ.25 వేలు, అసెంబ్లీ అభ్యర్థి రూ.10వేలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకైతే రూ.15వేలు డిపాజిట్ చేయాలి.

అభ్యర్థికి 16.66% లేదా ఆరో వంతు ఓట్లు రాకపోతే అతను జమ చేసిన డిపాజిట్ నగదు తిరిగి ఇవ్వరు.

అభ్యర్థి గెలిచినప్పుడో, ఆరో వంతు ఓట్లు వస్తేనో లేదా నిర్దేశిత సమయం కంటే ముందే నామినేషన్ ఉపసంహరించుకుంటే డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు.

ఇందులో SC, STలకు 50% రాయితీ

తొలి ఎన్నికల్లో(1951) ఎంపీ అభ్యర్థులకు రూ.500, MLA అభ్యర్థులకు రూ.100గా ఉండేది. 2009లో EC దీనిని పెంచింది

ఈసీ డేటా ప్రకారం 1951 నుంచి 2019 వరకు 91,160 మందిలో 71,245(78 శాతం) మంది డిపాజిట్లు కోల్పోయారు.

1996లో అత్యధికంగా 13,952 మంది అభ్యర్థుల్లో 12,688(91%) మంది డిపాజిట్లు కోల్పోయారు. 1957 ఎన్నికల్లో అత్యల్పంగా 130 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి.

2019లో 670 మంది డిపాజిట్లు కోల్పోగా.. 3,443 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 3,431 మందికి ఆరో వంతు ఓట్లు కూడా రాకపోవడంతో కట్టిన నగదును పోగొట్టుకున్నారు.

Tags:    

Similar News