IAS Officer : క్యాన్సర్‌తో భార్య మృతి.. నిమిషాల్లోనే ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య
అస్సాంలో హృదయవిదారక ఘటన జరిగింది. క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ భార్య మృతి చెందడంతో తట్టుకోలేక నిమిషాల వ్యవధిలోనే భర్త, ఐపీఎస్ ఆఫీసర్ శిలాదిత్య చెటియా ( Shiladitya Chetia ) ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకున్న ఆయనను ఆస్పత్రికి తరలించేలోపు మరణించారు. శిలాదిత్య అస్సాం ప్రభుత్వంలో హోం&పొలిటికల్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా పనిచేసేవారు. 2009 బ్యాచ్‌కు చెందిన ఆయన పలు జిల్లాలకు ఎస్పీగా సేవలందించారు.
అయితే అనారోగ్యంతో ఉన్న తన భార్య అగామోనీ బార్బరువాను చూసుకోవడానికి శిలాదిత్య చెటియా గత నాలుగు నెలలుగా సెలవులో ఉన్నారు. గౌహతి నగరంలోని నెమ్‌కేర్ ఆసుపత్రిలో శిలాదిత్య చెటియా భార్య చికిత్స పొందుతున్నారు. శిలాదిత్య చెటియా భార్య చాలా నెలలుగా తీవ్ర అస్వస్థతకు గురై వైద్య సంరక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె చికిత్స కోసం ఆస్పత్రిలో ప్రత్యేక గది కూడా తీసుకున్నారని తెలిపాయి.