Karnataka : అసెంబ్లీలోకి కత్తితో వచ్చిన మహిళ

అసెంబ్లీలో మరోసారి బయటపడ్డ భద్రతా లోపం;

Update: 2023-07-10 08:45 GMT

కర్ణాటక అసెంబ్లీలోకి ఒక మహిళా కత్తితో ప్రవేశించడానికి చేసిన ప్రయత్నం కలకలం రేపింది. విధాన సౌధ వద్ద తనిఖీలు చేస్తూ ఉండగా ఈ విషయం బయటపడింది. కర్ణాటక అసెంబ్లీలో నాలుగు రోజుల క్రితం ఒక సామాన్య వ్యక్తి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న ఘటన మరువక ముందే అటువంటి మరో ఘటన చోటు చేసుకుంది. విధాన సౌధలోకి ఒక మహిళ కత్తితో ప్రవేశించేందుకు ప్రయత్నించింది. భద్రత సిబ్బంది ఆమెను గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

విధాన సౌధ వద్ద ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో భద్రత వైఫల్యం దృష్టిలో పెట్టుకొని మరింత భద్రతను పెంచారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక మహిళను తనిఖీలు చేస్తుండగా ఆమె వద్ద కత్తి లభించింది. ఆమె హ్యాండ్ బ్యాగ్ ను స్కానింగ్ మెషిన్ లోకి పంపక అందులో ప్రమాదకర వస్తువులు ఉన్నట్టుగా సిగ్నల్ వచ్చింది. వెంటనే బ్యాగ్ ను చెక్ చేయగా అందులోంచి కత్తి బయటపడింది. కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మహిళలు కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఆ మహిళ బయట వ్యక్తి కాదని, అసెంబ్లీలోనే వేరే విభాగంలో చేసే మహిళ సిబ్బంది అని కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో విధాన సౌధ స్పీకర్ అసెంబ్లీ పరిసరాలను పరిశీలిస్తున్నారు.

గతవారం బడ్జెట్ సమావేశాల హడావిడిలో ఉండగా ఒక వ్యక్తి దర్జాగా సభలో ప్రవేశించి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న విషయం తెలిసిందే. నిందితుడు ఎమ్మెల్యే కరియమ్మ స్థానంలో కూర్చుండగా ఒక జెడిఎస్ ఎమ్మెల్యే అతనిని మీరు ఎవరంటూ ప్రశ్నించడంతో విషయం బయటపడింది. నిందితుడు ఈసారి మరో ఎమ్మెల్యే పేరు చెప్పి తప్పించుకోడానికి ప్రయత్నించడంతో విషయం స్పీకర్ దృష్టికి తీసుకెళ్లగా మార్షల్స్ అతనిని బయటకు పట్టుకువెళ్లారు. సుమారు 70 సంవత్సరాల వయసున్న నిందితుడిని రుద్రప్పగా గుర్తించారు. విజిటర్స్ పాస్ సంపాదించిన రుద్రప్ప నూతన ఎమ్మెల్యే అని చెప్పి లోపలికి ప్రవేశించాడని పోలీసులు చెప్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అని చెప్పడంతో మార్షల్ సైతం గుర్తు పట్టకోలేకపోయారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News