World's Highest Tunnel : ప్రపంచంలోనే ఎత్తైన సొంరంగం.. షింకుల్ లా టన్నెల్ పనులు ప్రారంభం
లేహ్ కు వెళ్లే మార్గంలో నిర్మించతలపెట్టిన షింకులా టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ద్రాస్ సెక్టార్లో పర్యటన సందర్భంగా ప్రధాని ఈ టన్నెల్ పనులను ప్రారంభించారు. ఈ టన్నెల్ పొడవు దాదాపు 4.1 కిలోమీటర్లు. 15,800 ఫీట్ల ఎత్తులో నిర్మిస్తున్నారు.
నిమిపదుం దర్చా రోడ్డు మార్గంలో ఈ టన్నెల్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయితే ఎలాంటి వాతావరణంలోనైనా లేహ్ కు వెళ్లేందుకు మార్గం సుగమమై వేగంగా సైనిక దళాలు ఆయుధాలను, సామగ్రిని తరలించేందుకు వీలు చిక్కుతుంది. ఈ సొరంగం నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన టన్నెల్ గా రికార్డులకెక్కనున్నది.