Mamata Banerjee: విపక్షాల భేటికి లేఖ అందలేదన్న వైసీపీ.. ఖండించిన టీఎంసీ..
Mamata Banerjee: విపక్షాల భేటీకి తమకు ఆహ్వానం లేదన్న వైసీపీ వ్యాఖ్యలను.. తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది.;
Mamata Banerjee: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధిని ఎన్నికపై తమకు ఆహ్వానం లేదన్న వైసీపీ వ్యాఖ్యలను.. తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. ఈనెల 11వ తేదీన మమతా బెనర్జీ స్వయంగా సీఎం జగన్‌కు లేఖరాసినట్లు వెల్లడించింది. ఈ విషయంలో వైసీపీ ఎందుకు తప్పుడు ప్రచారం చేశారో అర్ధం కావడంలేదని టీఎంసీ, మమత రాసిన లేఖను మీడియాకు విడుదల చేసింది. అయితే బీజేపీ వ్యతిరేక సమావేశాల్లో పాల్గొనేందుకు వైసీపీ ఎందుకు అంతగా భయపడుతుందోనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీబీఐకి భయపడే జగన్మోహన్ రెడ్డి మమతా బెనర్జీ నిర్వహించిన విపక్షాల సమావేశంలో పాల్గొనలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.