Lok Sabha : లోక్‌సభలో పిన్న వయసు ఎంపీ ఎవరో తెలుసా?

Update: 2024-06-25 06:45 GMT

2024 లోక్‌సభ ఎన్నికలు అనేక కొత్త రికార్డులను కలిగివున్నాయి. గణనీయమైన సంఖ్యలో యువకులు తొలిసారి పార్లమెంట్లోకి అడుగుపెట్టడం మొదటి విశేషం. కౌశాంబి లోక్‌సభ స్థానం నుండి గెలిచిన 25 ఏళ్ల పుష్పేంద్ర సరోజ్ ( Pushpendra Saroj ) భారతదేశ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన లోక్‌సభ ఎంపీగా రికార్డుకెక్కాడు.

పుష్పేంద్ర సరోజ్ సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేసి లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో బీజేపీ సిట్టింగ్ ఎంపీ వినోద్ సోంకర్ పై విజయం సాధించారు. 2019లో పుష్పేంద్ర సరోజ్ తండ్రి ఇంద్రజీత్ సరోజ్ సోంకర్ చేతిలో ఓడిపోయారు.

“నా లక్ష్యం ప్రభుత్వంతో కలిసి పనిచేయడం, దానికి వ్యతిరేకంగా కాదు" అని దళిత యువ నాయుకుడైన పుష్పేంద్ర అన్నారు. పుష్పేంద్ర సరోజ్ లండన్ లోని క్వీన్ మేరీ యూనివర్శిటీ నుండి అకౌంటింగ్, మేనేజ్మెంట్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తిచేశారు. 2021లో భారతదేశానికి తిరిగి వచ్చి రాజకీయాల్లో చేరారు.

Tags:    

Similar News