సూర్యాపేటలో పంచాయతీ కార్యదర్శులు ఆందోళన బాట పట్టారు. దురాజ్ పల్లి క్రాస్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నాలుగేళ్ల ప్రొబేషనరీ కాలం పూర్తయినప్పటికీ.. తమను క్రమబద్ధీకరించలేదని ప్రభుత్వ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే రేపటి నుంచి రాష్ట్ర వ్యా ప్తంగా సమ్మె చేపడతామని కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.