Ahmedabad accident: ఇస్కాన్ వంతెనపై ఘోర ప్రమాదం
9 మంది మృతి, 13 మందికి గాయాలు;
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం ఇస్కాన్ వంతెనపై అతివేగంతో వచ్చిన జాగ్వార్ కారు ఢీకొనడంతో పోలీసు కానిస్టేబుల్‌తో సహా 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఇస్కాన్ వంతెనపై అర్ధరాత్రి రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదాన్ని చూసేందుకు కొందరు అక్కడ గుమిగూడారు. అదే సమయానికి ప్రమాదస్థలంలో ఉన్న వ్యక్తుల మీదకు గంటకు 160కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న జాగ్వార్ కారు దూసుకెళ్లింది. దీంతో 9 మంది మృతి చెందారు, 12 మందికి గాయాలు అయ్యాయి.