ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఎలాంటి అనుమతి తీసుకోకుండా శనివారం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. దీంతో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీగా గుమికూడారు. సెక్షన్ 144, పోలీసు 30 యాక్టు అమల్లో ఉన్నప్పటికీ అనుమతి లేకుండా పర్యటించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో అల్లు అర్జున్ సహా ఎమ్మెల్యే శిల్పా రవిపై నంద్యాల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.