KARNATAKA: అన్నభాగ్య పథకం..అమలుకు ఇబ్బందులు
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీల్లో ఒకటైన అన్నభాగ్య పథకం అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీల్లో ఒకటైన అన్నభాగ్య పథకం అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పథకాన్ని జులై 1 నుంచి అమల్లోకి తీసుకురావాల్సి ఉండగా అందుకు అవసరమైన బియ్యం సేకరణ సాధ్యం కావట్లేదు. అయోమయంలో పడ్డ సిద్ధరామయ్య సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత బియ్యానికి బదులుగా నగదు ఇస్తామని ప్రకటించింది. కిలో బియ్యానికి రూ.34 చొప్పున ఐదు కిలోల బియ్యానికి సమానమైన డబ్బును బీపీఎల్ ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపింది.