ఓరుగల్లు వేదికగా తెలంగాణలో రాజకీయ పోరు మొదలైంది. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ మాటల తూటాలు పేల్చుతోంది. ప్రధాని టూర్‌లో అధికారిక కార్యక్రమాలు కూడా ఉన్నా హాజరుకాకూడదని బీఆర్ఎస్ నిర్ణయించింది. మోదీ తెలంగాణ పర్యటనను బహిష్కరిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ పుట్టుకను ప్రధాని మోదీ అవమానించారని ఇపుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిన మొదటి రోజు నుంచే మోదీ తెలంగాణపై వ్యతిరేకత చూపించారనిఆరోపించారు.మోదీ, బీజేపీని రేవంత్‌రెడ్డి ఎందుకు విమర్శించడం లేదన్నారు. గాంధీ భవన్‌లో గాడ్సే దూరాడంటూ రేవంత్‌పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.