హైదరాబాద్‌లో చికెన్ ధరలు మండిపోతున్నాయి. రికార్డ్ స్థాయికి చేరాయి. మే నెలలో కేజీ చికెన్ 200 రూపాయలు ఉండగా,.. ప్రస్తుతం కిలో చికెన్ ధర 300 రూపాయలుగా ఉంది. అదేవిధంగా మటన్ కేజీ 800 రూపాయల నుంచి 1,000 రూపాయలు పలుకుతోంది. ఒక్క కోడి గుడ్డు ధర 5రూపాయల 50పైసలుగా ఉంది. మరోవైపు కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. దీంతో కూరగాయలు కొనలేక నాన్‌వేజ్ తినలేక జనాలు ఇబ్బందులు పడుతున్నారు.