బెంగళూరులో ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి.రెండు కోచ్‌లకు మంటలు వ్యాపించాయి.స్టేషన్ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.కేఎస్సార్ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.ఇటీవలే ఫలకనుమా ఎక్స్‌ప్రెస్ లో మంటలు చెలరేగి రైలు భోగీలు మొత్తం తగలబడిన ఘటన మరదక ముందే మళ్లీ ఉద్యాన్ రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులుభయాందోళనకు గురవుతున్నారు.ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు పరిస్థితి సమీక్షీస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు.