ఈ నెల 19న లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా నియోజకవర్గం నుంచి భారీగా టీడీపీ సైనికులు పాల్గొంటారన్నారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. దెందులూరు నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంపై నియోజకవర్గ నేతలు, క్లస్టర్ ఇంఛార్జీలు, సీనియర్ నేతలతో రివ్యూ చేశారు చింతమనేని ప్రభాకర్. కార్యకర్తలే తన బలం బలహీనత అన్నారాయన. వారి వల్లే తాను రాజకీయాల్లో రాణిస్తున్నట్లు తెలిపారు. మండల నేతలు ప్రతి కార్యకర్తల్ని కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ నెల 19 తర్వాత నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం గ్రామాల వారీగా నిర్వహిస్తామని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.