కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వాసులను హైనాలు భయపెడుతున్నాయి. రాత్రిళ్లు పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి హైనా వచ్చి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇన్ని రోజులు కొండ ప్రాంతాలకే పరిమితమైన హైనాలు ఇప్పుడు ఊళ్లపై పడుతున్నాయి. తిమ్మాపూర్ గ్రామంలో ఓ కుక్కపై హైనా దాడి చేసింది. అది బతికుండగానే పీక్కు తినడం చూసి భయబ్రాంతులకు గురయ్యారు. కుక్కపై హైనా దాడి చేసిన దృశ్యాలను కొందరు యువకులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. గతంలో గొర్రెల మందపై దాడి చేసి చంపేసింది. మళ్లీ ఇప్పుడు గ్రామంలో కుక్కపై దాడి చేయడంతో స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. హైనాను బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.