PROTEST: ఆందోళనలతో అట్టుడికిన బెంగళూరు
చంద్రబాబుకు మద్దతుగా రెండోరోజూ ఆందోళనలు.. సైకో జగన్ అంటూ ప్రజల నినాదాలు;
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మద్దతుగా జరిగిన ఆందోళనలతో బెంగళూరు దద్దరిల్లింది. వరుసగా రెండోరోజూ బెంగళూరులో నిరసనలు వెల్లువెత్తాయి. తెలుగు సంఘాలతోపాటు బెంగళూరు నగర ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.
బెంగళూరు విధాన సౌధ సమీపంలో ప్రజలు ఆందోళనలు చేశారు. తెలుగు సంఘాలకు ఐటీ ఉద్యోగులు, నిపుణులు మద్దతు ప్రకటించారు.
మరోవైపు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకి మద్దతుగా గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ నేతలు నాలుగో రోజు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన దీక్ష కొనసాగించారు. తాడేపల్లికి చెందిన నాయకులు నిరసన దీక్షలో పాల్గొన్నారు.