Lunar Eclipse : కనువిందు చేసిన సంపూర్ణ చంద్రగ్రహణం.. ఎరుపు వర్ణంలోకి మారిన చంద్రుడు..
భారతదేశవ్యాప్తంగా పలు నగరాల్లో కనిపించిన గ్రహణం
ఆకాశంలో ఓ అద్భుతమైన ఖగోళ పరిణామం చోటుచేసుకుంది. భారతదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు కొన్నిచోట్ల పూర్తి ఎరుపు రంగులో దర్శనమివ్వనుండటం విశేషం. దీన్నే ఖగోళ శాస్త్ర పరిభాషలో 'బ్లడ్ మూన్' అని పిలుస్తారు. ఈ అరుదైన దృశ్యం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళితే, భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 9 గంటల 50 నిమిషాలకు ఈ చంద్రగ్రహణం మొదలైంది. ఇది అర్ధరాత్రి దాటి సోమవారం తెల్లవారుజామున 1 గంట 31 నిమిషాల వరకు కొనసా గింది. సుమారు మూడున్నర గంటల పాటు ఈ గ్రహణం వీక్షించేందుకు అవకాశం కలిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా బ్లడ్ మూన్ దృశ్యంపై ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.