కర్నాటక ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. ఖమ్మంలో నిర్వహించే సభలో పొంగులేటి, నాగర్‌కర్నూల్‌లో జరిగే సభలో జూపల్లి కృష్ణారావు పార్టీ కండువా కప్పుకుంటారని తెలియజేశారు. ప్రియాంక గాంధీని మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని కోరినట్లు చెప్పారు. త్వరలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నట్లు మల్లు రవి వెల్లడించారు.