యువతిని కిడ్నాప్ చేసి మరీ..పెళ్లి చేసుకున్నాడు
రాజస్థాన్లోని జైసల్మేర్లో దారుణం జరిగింది. పది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు.;
రాజస్థాన్లోని జైసల్మేర్లో దారుణం జరిగింది. పది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. అమ్మాయిని తన ఒడిలో పెట్టుకుని కాలుతున్న గడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ యువతికి అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడితో ఈ నెల 12 వివాహం జరగాల్సి ఉంది. అయితే ఈ నెల 1న పుష్పేంద్ర, అతని అనుచరులు కలిసి ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం ఎడారిలోకి తీసుకెళ్లి పుష్పేంద్ర.. యువతిని చేతులతో ఎత్తుకుని మంట చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశాడు. బాధితురాలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.
ఈ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ కూడా షేర్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్.. అధికారులను ఆదేశించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని.. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు .