BRAHMANI: వైసీపీ నేతలు కబోదులు: నారా బ్రాహ్మణి
వైరల్‌గా మారిన నారా బ్రాహ్మణి ట్వీట్... పాలనలో అసమర్థలు మాత్రమే కాదన్న లోకేశ్ సతీమణి...;
వైసీపీ నేతలు పాలనలో అసమర్థులు మాత్రమే కాదనీ, నిజాన్ని చూడలేని కబోదులంటూ నారా బ్రాహ్మణి ధ్వజమెత్తారు. బ్యూరోక్రసీ, ప్రభుత్వ, బహుళ జాతి సంస్థలను, యువత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం వైసీపీకి తగదని బ్రాహ్మణి హితవు పలికారు.
వైసీపీకి వ్యాపార సూత్రాలు బోధిస్తూ సీమెన్స్ మాజీ ఎండీ అనుమానాలు నివృత్తి చేశారని ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. ఉపాధి అవకాశాల రక్షణకు ప్రతీ ఒక్కరూ చంద్రబాబు వెంటే ఉంటున్నారని బ్రాహ్మణి స్పష్టం చేశారు.