LOKESH: వైసీపీపై యుద్ధం మొదలు పెట్టాం: లోకేశ్‌

పవన్‌తో భేటీ తర్వాత లోకేశ్‌ ప్రకటన... సైకో పాలనకు చరమగీతం పాడుతామని స్పష్టీకరణ;

Update: 2023-09-15 04:45 GMT

 వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం మొదలు పెట్టాలని చంద్రబాబు, పవన్‌, బాలకృష్ణ, తాను కలిసి నిర్ణయించినట్లు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు. ఏపీ ప్రజల భవిష్యత్ కోసమే కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ప్రజావేదిక కూల్చడం నుంచి చంద్రబాబుని రిమాండ్‌కు పంపే వరకూ జగన్ సైకో చర్యలకే పాల్పడ్డారని లోకేశ్‌ దుయ్యబట్టారు. ప్రజల కోసం పోరాడినందుకే చంద్రబాబును జైలులో పెట్టారని ఆరోపించారు.


తాము ఏమీ షెల్‌ కంపెనీలు పెట్టి, క్విడ్‌ ప్రోకో వంటి మోసాలు చేయలేదని లోకేశ్ చెప్పారు. చంద్రబాబు భద్రతపై లోకేశ్ మరోసారి ఆందోళ వ్యక్తంచేశారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలేదని, ఇక భద్రతపై నమ్మకం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.

Tags:    

Similar News