తెలంగాణ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు లేకున్నా సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు కొనసాగించడంపై అభ్యంతరం తెలిపింది. పనులు కొనసాగిస్తే కోర్టు ధిక్కరణకు గురవుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.పర్యావరణ అనుమతులు లేనందున సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని గతంలో ఎన్జీటీ ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం ఆ ఆదేశాలను పక్కనపెట్టి పనులు సాగిస్తోంది.దీంతో పనులు కొనసాగిస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని గోదావరి రివర్‌బోర్డు, కేంద్ర పర్యావరణ శాఖలపైన ఎన్టీజీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వంపై చేపట్టిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.