సీఎం జగన్‌పై జనసేనాని పవన్‌కల్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. సీఎంకు అక్షరాలు, ఒత్తులు, దీర్ఘాలు రావని విమర్శించారు.జగన్‌కు భవిష్యత్‌లో అక్షరాలు నేర్పిస్తానని పవన్ పేర్కొన్నారు. తాను ఊగిపోతూ మాట్లాడుతున్నానని బాధపడుతున్నారని.ఇక నుంచి జగన్ స్టైల్‌లోనే మాట్లాడతానని అన్నారు.అమ్మ ఒడి పథకం సభలో జగన్ అలాంటి మాటలు మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు.తాను చెప్పు చూపించి మాట్లాడానంటే దాని వెనుక చాలా కథ ఉందని స్పష్టం చేశారు.