PAWAN: భువనేశ్వరి, బ్రాహ్మణిలకు పవన్ పరామర్శ
ధైర్యంగా ఉండాలన్న పవన్‌కల్యాణ్... చంద్రబాబు ధైర్యంగా ఉన్నారని వెల్లడి;
రాజమండ్రిలో నారా భువనేశ్వరి, బ్రాహ్మాణీలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం వీరిని కలిసి ధైర్యం చెప్పారు. అరగంట పాటు చంద్రబాబు కుటుంబసభ్యులతో జనసేనాని సమావేశమయ్యారు. చంద్రబాబు ధైర్యంగా ఉన్నారని మీరు కూడా అధైర్యపడొద్దని ఆత్మస్థైర్యం నింపారు.