నిద్దరోయిన రైల్వే గేట్‌.. వాహనదారులకు ఇక్కట్లు..

Update: 2023-07-03 07:15 GMT

పార్వతీపురం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వే గేట్‌ మ్యాన్‌ నిర్వాకంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైలు వచ్చే సమయం కావడంతో గేటు వేసి రూమ్‌లోకి వెళ్లి నిద్రపోయాడు.రైలు వెళ్లిన ఎంతకు గేట్ ఓపెన్ చేయకపోవడంతో వాహనాలు గేటు వద్దే నిలిచిపోయాయి.చివరికి వాహనదారులు వెళ్లి పిలిచిన తర్వాత నిద్ర లేచిన గేట్‌ మ్యాన్‌ గేటు ఓపెన్ చేశాడు. ఘటనపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News