Hyderabad: అత్తాపూర్‌లో దారి దోపిడి
బెదిరించి రూ.12వేల నగదు, సెల్‌ఫోన్లు తీసుకుని పరారు;
హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో దారి దోపిడి జరిగింది. శివాలయం గుడి సమీపంలో ఇద్దరిని బెదిరించి వారి వద్ద నున్న 12వేల రూపాయల నగదు, సెల్‌ఫోన్లు తీసుకుని పరారయ్యారు. స్థానికంగా ఉండే వెంకటయ్య, సిద్దయ్య లేబర్ పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు కత్తులతో బెదిరించారు. పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదారు. ఇద్దరిని బట్టలు విప్పించారు. వారి వద్దనున్న 12వేల నగదు తీసుకున్నారు. అలాగే ఇద్దరి సెల్‌ఫోన్లు లాక్కుని పరారయ్యారు. వెంకటయ్య, సిద్ధయ్య ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.