KADAPA: రాష్ట్ర ముఖ్యమంత్రి పరదాల మధ్య పర్యటన
గత నాలుగేళ్లుగా ఏ జిల్లాకు వెళ్లినా ఆయన పరదాల మధ్య వెళ్తున్నారు.
గత నాలుగేళ్లుగా ఏపీ సీఎం జగన్ ఏ జిల్లాకు వెళ్లినా పరదాల మధ్యే వెళ్తున్నారు. సొంత జిల్లా కడపలోనూ అదే పరిస్థితి. కడపలో రాజీవ్ పార్క్ ప్రారంభించేందుకు వెళ్లగా అధికారులు ప్రహరీ చుట్టూ పరదాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా పరదాల మధ్య పర్యటించడమేంటని కడప నగర వాసులు మాట్లాడుకుంటున్నారు. ఇక కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్ద పలువురు వైసీపీ నాయకులు సీఎం ఫొటోతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ ప్రహరీ మొత్తం ఫ్లెక్సీలతో నిండిపోయింది.