SC: చంద్రబాబును అప్పటివరకూ అరెస్ట్ చేయొద్దు
ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశం;
ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. కోర్టు విచారణ జరిగేవరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను పొడిగించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. అప్పటివరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను అంగీకరించాలని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.