Tamil Nadu : వర్షాలు, వరదలతో తమిళనాడు ఉక్కిరిబిక్కిరి

Update: 2024-10-26 14:15 GMT

భారీ వర్షాలతో తమిళనాడులోని ప్రధాన నగరాలు అతలాకుతలమయ్యాయి. ఏడు జిల్లాలకు వాతావరణ అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేశారు. కొద్ది రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు నమోదవుతుండగా తాజాగా దానా తుపాను ప్రభావం కూడా కనిపిస్తోంది. రెండ్రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధురైలో కుండపోత వర్షంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మదురైలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల వారిని తరలించింది. సహాయక చర్యలను చేపట్టింది. మదురై కలెక్టర్‌తో ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News