ఓటర్ జాబితాలోని అక్రమాలపై టీడీపీ దృష్టి సారించింది. అదేవిధంగా పార్టీ చేపట్టిన ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంపై వర్క్‌షాపు కొనసాగుతుంది. కాసేపట్లో ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల వ్యవహారం.. ఓట్ల తొలగింపు, ఓటరు జాబితాలోని అవకతవకలపై చర్చించనున్నారు. తర్వాత నియోజకవర్గాల్లో వేలాది ఓట్లు తొలగించడంపై సమీక్షిస్తారు. ఓటరు జాబితాల్లో వైసీపీ అక్రమాలపై పోరాటానికి.. అవకతవకలను అడ్డుకోవడానికి టీడీపీ నేతలు ప్రణాళికను సిద్ధం చేయనున్నారు.