దళితులపై దాడులకు నిరసగా టీడీపీ ఆందోళన

రాష్ట్రంలో దళితులపై దాడులను నిరసిస్తూ టీడీపీ ఆందోళన చేపట్టింది.;

Update: 2023-06-21 11:30 GMT

మంగళగిరి హైవేపై కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో దళితులపై దాడులను నిరసిస్తూ టీడీపీ ఆందోళన చేపట్టింది. టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు ఆధ్వర్యంలో సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇంకెంత మంది దళితుల ప్రాణాలు తీస్తావు.. దళిత ద్రోహి జగన్‌ అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ఎంఎస్‌ రాజుతో పాటు పలువురు నేతలను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. దుగ్గిరాల పీఎస్‌కు తరలించారు.

Tags:    

Similar News