ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తేలిపోయింది. క్లూస్ టీమ్ విచారణలో వాస్తవాలు వెల్లడయ్యాయి. రైలు బోగిలోని విద్యుత్ తీగల్లో లోపం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని క్లూస్ టీమ్ తేల్చింది. ఎస్-4 బోగిలోని టాయిలెట్ దగ్గర షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మూడు బోగీలు పూర్తిగా దగ్ధం కాగా.. మరో మూడు బోగీలు పాక్షికంగా కాలిపోయాయి. ప్రయాణికులు సకాలంలో రైలు దిగేయడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తేలినా.. రైల్వే అధికారులు మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.