తిరుపతి జిల్లా రామకుప్పం ఎస్సై కృష్ణయ్య దూషించాడంటూ కుప్పం జడ్జికి ఫిర్యాదు చేశారు ఉన్సినానిపల్లి మాజీ సర్పంచ్ మహదేవి జయశంకర్ దంపతులు. స్టేషన్‌లో తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవడంతో కోర్టులో ఫిర్యాదు చేశారు. ఎస్సై కృష్ణయ్య తమను కులంతో పేరుతో దూషించడమే కాకుండా రివాల్వర్‌తో బెదిరించినట్లు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేసు నమోదు చేయాలంటూ ఆదేశించింది. మరోవైపు ఎస్సై కృష్ణయ్యతో ప్రాణ హాని ఉందని కుప్పం రూరల్ సీఐకి సైతం ఫిర్యాదు చేశారు జయశంకర్ దంపతులు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ వివిధ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.